calender_icon.png 24 February, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సమస్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

24-02-2025 12:14:45 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 23 (విజయ్ కాంతి): మహబూబాబాద్, పాలకుర్తి మండలంలోని శాతపురం గ్రామం గుండా వెళ్లే కాలువలో సాగునీరు రాక చేతికి వచ్చిన పంట నీళ్లు లేక ఎండి పోతుందని అటువైపు వెళుతున్న మాజీ మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావుతో రైతులు తమ గోడు వెళ్ళబోసుకోగా వారి సమస్య తెలుసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ఎండాకాలం కూడా చెరువులు మెత్తడి పడేవాని  కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవని అన్నారు, ఇ కెనాల్ ధ్వారా దాదాపు పాలకుర్తి నియోజకవర్గం లో సుమారు 1000 ఎకరాల పైచిలుకు పంట సాగుతుందన్నారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పూస్కూరి శ్రీనివాస్ రావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య మరియు రైతులు పాల్గొన్నారు.