02-03-2025 04:37:13 PM
ముత్తారం (విజయక్రాంతి): హైదరాబాదులో హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఎర్రబెల్లితో ముత్తారం మాజీ జడ్పిటిసి నాగినెని జగన్ మోహన్ రావు పాల్గొన్నారు. నాగినెని మేనల్లుడు డా. కృష్ణ చైతన్య నూతన హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని దావఖానను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులతో పాటు ముత్తారం మాజీ జడ్పిటిసి నాగినెని జగన్ మోహన్ రావు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.