12-04-2025 10:16:44 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ జయంతి శోభా యాత్రలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, నవకాంత్, శ్రీనివాస్ రెడ్డి, పాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.