01-04-2025 10:59:59 AM
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ అప్ప సెట్ కార్
బిచ్కుంద,(విజయక్రాంతి): పేద ప్రజలకు సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లికార్జున అప్ప సెట్ కార్ అన్నారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలో సన్నబియ్యం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు. ధనవంతుల కుటుంబాలే సన్న బియ్యం తినేవారని, పేద ప్రజలు దొడ్డు బియ్యం తినేవారందరూ సమానమేనని ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
రేషన్ దుకాణల ద్వారా పంపిణీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, నోచా నాయకుడు తుకారం, మైనార్టీ నాయకులు నయీమ్, ఖలీల్, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్, పోతుల లింగం, ఉత్తం నాయక్, సిమా, గంగారం తదితరులు పాల్గొన్నారు.