కామారెడ్డి (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి జూనియర్ ఆర్చరీ పోటీలను మాజీ ఆర్చరి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, జిల్లా కార్యదర్శి కదిరి మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు, ఓటమి సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పిన్నం రాంచంద్రం, కోచ్ ప్రతాప్ దాస్, మురళి, పీరియ, బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, కడారి రమేష్, బుర్రి రవి, చెప్యాల రవి, ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.