calender_icon.png 19 March, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అడ్రస్ గల్లంతు

19-03-2025 07:26:59 PM

బిఆర్ఎస్ మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాన రామకృష్ణ.. 

భద్రాచలం (విజయక్రాంతి): 3.10 కోట్ల వార్షిక బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి భట్టి బడ్జెట్ అంకెల గారడిగా ఉంది అని భద్రాచలం మాజీ నియోజకవర్గం ఇంచార్జ్ మాన రామకృష్ణ  విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఈ బడ్జెట్ లో కనుమరుగు అయ్యాయని అన్నారు. అదేవిధంగా వృద్ధులు వికలాంగుల పెన్షన్ పెంపు హామీలు ఏమైపోయినవి అని, మహిళలకు 2500 రూపాయలు, తులం బంగారం వంటి హామీలను బంగాళాఖాతంలో కలిపారని, రైతులకి 15 వేల రూపాయల రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు మంగళం పాడేసారని అన్నారు. రైతులకు వ్యవసాయ రంగానికి తాగునీటి సరఫరా కోసం బడ్జెట్లో నిధులు నిల్, వైద్య ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని, విద్యారంగాన్ని తుంగలో తొక్కేసారని, కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లు వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని మానే రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.