- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఓం ప్రకాష్
- సిక్స్ డేస్ సీఎంగా పేరు
- టీచర్ల నియామకం స్కాంలో తీహార్ జైలుకు
చంఢీగడ్, డిసెంబర్ 20: హర్యానా మా జీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా(89) కన్ను మూశారు. శుక్రవారం తన నివాసంలో గుం డెపోటుతో చనిపోయారు. టీచర్ల నియామ కం కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ఆయన కరోనా సమయంలో జైలు నుంచి విడుదలయ్యారు. ఉపప్రధానిగా పనిచేసిన దేవీలాల్ చౌదరి కుమారుడే చౌతాలా. ఆయన ఐదు సార్లు హ ర్యానా సీఎంగా.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1935 జనవరిలో చౌతా లా జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారు లు.. ముగ్గు రు కుమార్తెలు ఉన్నారు.
ఐదుసార్లు సీఎంగా..
1989లో ఓపీ చౌతాలా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1989 నుంచి 2005 వరకు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. 1990 జూలై 12 నుంచి 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. 1987లో రాజ్యసభకు ఎంపికయ్యారు. హర్యానాలో జాట్ కమ్యూనిటీని ఏకీకృతం చేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించారు. హర్యానా రాజకీయాల్లో జాట్‌ల ప్రాముఖ్యత పెరగడంలో చౌతాలా కీలకపాత్ర పోషించారు. జాట్‌లను బలోపేతం చేసి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
టెన్త్ ఫెయిల్ అయినా సీఎంగా..
చౌతాలా పదో తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టు లో ఫెయిల్ అయ్యారు. కరోనా కారణంగా పరీక్షలు రాయకుండానే జైలులోమొదట ఓపెన్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. అయితే పదోతరగతి పూర్తి చేయకుండానే ఇంటర్ పాస్‌కు అధికారులు ఒప్పుకోలేదు.
అక్రమ ఆస్తుల కేసులో..
1993 మధ్య అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకున్నారని చౌతాలాపై ఆరోపణలు వచ్చాయి. చౌతాలాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎక్కువగా ఆస్తులను సమకూర్చుకున్నారని అభియోగాలు వచ్చా యి. 2022లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు అతడిని దోషిగా తేలల్చింది.
చౌతాలాకు శిక్షతో హర్యానాలో విధ్వంసం..
2013లో చౌతాలకు శిక్ష ఖరారు అయినపుడు కోర్టు వెలుపల పోలీసులతో ఐఎన్ ఎల్డీ కార్యకర్తలు గొడవకు దిగారు. దాదాపు 4,000 మంది కార్యకర్తలు రాళ్లు, పెట్రోల్ బాంబులతో విధ్వంసం సృష్టించారు.
పలువురి సంతాపాలు..
ఓం ప్రకాశ్ చౌతాలా మరణంపై పీఎం మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చౌతాలా మరణం రాష్ట్రానికి కోలుకోలేని నష్టమని హర్యానా సీఎం నయాబ్ సింగ్ అ న్నారు. తాను వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయానని భూపిందర్ సింగ్ హుడా అన్నారు.
టీచర్స్ స్కాంలో తీహార్ జైలుకు
1999 జూనియర్ బేసిక్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. 2000 సంవత్సరంలో 3,206 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో 2013లో ఆయన దోషిగా తే లారు. దీంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.