calender_icon.png 3 March, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది

03-03-2025 02:13:52 PM

హామీలు అమలు చేసే వరకు పోరాటం

మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసాలపై బీఆర్ఎస్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మహిళలను రైతులను కూలీలను కార్మికులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు.

కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కెసిఆర్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మరోసారి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ పసుల బాలమణి, గండ్ర మధుసూదన్ రావు పార్టీ అధికార ప్రతినిధులు ఉత్తునూరు బలవంతరావు, గైని శ్రీనివాస్ గౌడ్, భాను ప్రసాద్, బాలచంద్రం, కృష్ణమూర్తి, నీరడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.