calender_icon.png 20 April, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ గవర్నర్ తమిళిసైకి పితృ వియోగం

10-04-2025 02:23:42 AM

తమిళనాడు కాంగ్రెస్ నేత కుమారి అనంతన్ మృతి

హైదరాబాద్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ తండ్రి, తమి ళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) (92) కన్నుమూశారు. ప్రముఖ కాంగ్రె స్ నేతగా, గాంధేయవాదిగా, గొప్ప వక్తగా పేరు పొందిన ఆయన.. వయో సంబంధిత సమస్యలతో మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నా రు. వీరిలో బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్‌తమిళిసై ఒకరు. గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్న ఆయన.. పార్ల మెంటులో తొలిసారి తమిళంలో మాట్లాడి న నేతగా రికార్డు నెలకొల్పారు. తమిళ భా షా సంస్కృతుల అభివృద్ధికోసం విశేష కృ షిచేశారు. నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

తమిళిసై సౌందరరాజన్ తండ్రి మృతిపై సీఎం రేవంత్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తు డు, తమిళ భాష ప్రేమికుడైన అనంతన్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. అ నంతన్ నాలుగుసార్లు  శాసన సభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని సీఎం గుర్తు చేశారు. తమిళసైకి, వారి కుటుంబ సభ్యులకు సీఎం  ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.