calender_icon.png 13 February, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి మాజీ డీఎస్పీ గంగాధర్

13-02-2025 12:32:24 AM

కండువా కప్పి పార్టీకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): మాజీ డీఎస్పీ, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ వేసిన ఎం గంగాధర్ కాంగ్రె స్ పార్టీలో  చేరారు. కాంగ్రెస్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కన్‌సింగ్, కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ ప్రధా న కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష నేతలకోన్యాయం.. అధికారపక్ష నేతలకోన్యాయమా?: వీహెచ్ 

ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతూ కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆరోపించారు. అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.