calender_icon.png 1 April, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మాజీ ఉప సర్పంచ్ మృతి

30-03-2025 12:00:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 29: రోడ్డు ప్రమాదంలో మాజీ ఉప సర్పంచ్ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతినాయుడుపేట హైవే చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండల బండరావిరాల చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మల్లారెడ్డి, బాలిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తారామతిపేటకు చెందిన భరత్‌లతో కలిసిన దైవదర్శనం కోసం తిరుపతి బయలుదేరారు.

మార్గమధ్యలో తిరుపతినాయుడుపేట హైవే తొట్టంబేడు మండ లం పెద్దకన్నలి వంతెన వద్ద వీరు ప్రయాణిస్తున్న రోడ్డు ప్రమాదానికి గురై.. డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బండరావిరాల చెందిన మాజీ సర్పం చ్ శ్రీనివాస్ మృతి చెందిగా.. మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. కాళ్లు చేతులు విరిగినట్లు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు బండరావిరాల తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.