28-03-2025 05:08:03 PM
ప్రారంభించిన మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట్ సింగిల్ విండో సొసైటీ(Banswada Mandal Desaipet Single Window Society) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని, రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న సన్నం రకం ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాలుకు 500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320/-లకు, కామన్ గ్రేడ్ రూ.2300/-లకు కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతులు శుభ్రం చేసి పొల్లు లేకుండా, తేమ 17% లోపు ఉండేల కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మూడు రోజుల క్రితం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షులు అంబర్ సింగ్ గుండె పోటుతో మరణించడం వలన పాలక వర్గ సభ్యులతో కలిసి అంబర్ సింగ్ చిత్ర పటానికి పోచారం భాస్కర్ రెడ్డి పుష్పాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో విండో డైరెక్టర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.