calender_icon.png 26 March, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

24-03-2025 11:44:22 PM

మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా ఘటన..

యాంజియోప్లాస్టీ సర్జరీ.. పరిస్థితి విషమంగానే..

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సోమవారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తమీమ్‌ను హుటాహుటిన సావర్‌లోని కేపీజే ఆసుపత్రికి తరలించారు. తమీమ్‌ను పరీక్షించిన వైద్యులు తీవ్రమైన గుండెపోటుగా నిర్ధారించారు. యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించినప్పటికీ అతడి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం కరోనరి కేర్ యూనిట్ (సీసీయూ)లో 48 గంటల అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

తమీమ్ ఇక్బాల్ కోలుకునేందుకు మెడికల్ టీమ్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. స్పృహలోకి వచ్చిన తమీమ్ ఇక్బాల్ తన కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న తమీమ్ ఇక్బాల్  ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బంగ్లా మాజీ క్రికెటర్లు, బీసీబీ అధికారులు ఆసుపత్రికి చేరుకొని కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు.