calender_icon.png 20 April, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలింగ్ గ్లాసెస్ అందజేసిన మాజీ కౌన్సిలర్

07-04-2025 12:38:20 AM

మహబూబ్ నగర్ ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) : వేసవి తాపం నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకుగాను మాజీ కౌన్సిలర్ మూష నరేందర్ నాణ్యత కూడిన కూలింగ్ గ్లాసెస్ ను అందజేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు ఈ కూలింగ్ గ్లాసులను అందజేశారు.

ప్రస్తుతం ఉన్న వేసిన దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులకు తోచిన సహాయం చేయడం అభినందనీయమని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మూష నరేందర్ కు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సేవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తదితరులు ఉన్నారు.