హుజురాబాద్,(విజయక్రాంతి): ఇటీవల నూతనంగా బదిలీపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బల్దియా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ సమ్మయ్యను గురువారం మున్సిపల్ కమిషనర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి సత్కరించి పూష్ప గుచ్చం అందించి మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యం రాజు, ప్రతాప తిరుమల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హుజురాబాద్ పట్టణ ప్రాంతా అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని, తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు.