04-04-2025 12:48:59 AM
వారసిగూడ ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : ప్రముఖ పాత్రికేయులు సీనియర్ జర్నలిస్ట్ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పత్రిక మాజీ సంపాదకులు జీ వల్లీశ్వర్‌కు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అంద చేసింది. ఈ సందర్భంగా ఆయనను తన నివాసంలో కలిసి అభినందించారు. మాజీ బీజేపీ కార్పొరేటర్ వెంకటరమణి. పాత్రికేయ రంగం లో ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టంగుటూరి సుబ్బారావు, ఆర్‌కే నాయుడు, గద్రేజీ పాల్గొన్నారు.