calender_icon.png 13 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులకు ఆటంకం కలిగించిన మాజీ కార్పొరేటర్ అరెస్ట్

06-09-2024 12:15:28 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కార్పొరేటర్, 44వ డివిజన్ కార్పోరేటర్ మెండి శ్రీలత భర్త మెండి చంద్రశేఖర్ (మార్షల్) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపట్లో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ తో పాటు అధికారులపై దురుసు ప్రవర్తనతో పాటు వారిని దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించినట్టు పిర్యాదు అందడంతో అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంక పర్చడంతో పాటు ఇతర నేరాల కింద మార్షల్ ను అరెస్టు చేస్తున్నట్టుగా సమాచారం. ఇది ఇలా ఉండగా చంద్రశేఖర్ భార్య కార్పొరేటర్ శ్రీలత అరెస్ట్ ను ఖండించారు. అవినీతి గురించి ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. నగరపాలక సిబ్బంది మార్షల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆందోళనకు దిగారు.