calender_icon.png 21 February, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలు

17-02-2025 06:31:50 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలో మాజీ సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేగా యూత్ బానోత్ శ్రీను ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ కాలనీ సత్యసాయి స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. ముందుగా మాజీ సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం సుమారుగా 100 మంది యువకులతో పాటు ఆయన రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ... ప్రాంత అభివృద్ధి, అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.

తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులు కేసిఆర్ కి ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, ఉద్యమకారులు పోయం నరేందర్, సారపాక టౌన్ పార్టీ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాసరావు, బొల్లు సాంబశివరావు, బిట్రా సాయిబాబా, వలదాసు సాలయ్య, పూర్ణ, లక్ష్మి రెడ్డి, బొబ్బిలి, కనకాచారి, అశోక్ కృష్ణ, శివ, మాజీ ఎంపిటిసి వెంకటరమణ పంగి సురేష్, చరణ్, మిట్టకంటే సురేందర్ రెడ్డి, అలీమ్ పాషా, సూదిపాక ఈశ్వర్, సాయి, వంశీ, సాయి, శ్రీను, నాని, కుర్సం వెంకన్న, తుంగ నాగయ్య, ఉప్పుసాక సురేష్, కోట జయరాజ, శ్రీను పాల్గొన్నారు.