calender_icon.png 2 February, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాతీర్పును గౌరవించని మాజీ ముఖ్యమంత్రి

02-02-2025 12:06:12 AM

కల్వకుర్తి, ఫిబ్రవరి 1: మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజా తీర్పును ఏ రోజు కూ డా గౌరవించిన దాఖలాలు లేవని తన అహంకారం అణిచివేత వల్లే ఓటమి చెందిన విషయాన్ని నేటికీ గుర్తించడం లేదని బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షుడు విజయ్ కుమార్ శని వారం ఒక ప్రకటనలో విమర్శించారు.

తన పార్టీని కార్యకర్తలను కాపాడుకునేందుకు కాళ్ళ వేళ్ళ పడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుండగా ఏడాది పాటు అజ్ఞాతంలో ఉండి పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన జరిగింద న్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నిక ల్లోను టిఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే కెసిఆర్ అహంకారాన్ని దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.