calender_icon.png 8 January, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కేసీఆర్

31-12-2024 08:33:07 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(BRS party leader KCR) తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర(New Year) శుభాకాంక్షాలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికి 2025 సంవత్సరంలో మంచి జరగాలని ఆయన కోరారు. కాలప్రవాహంలో ఎదురొచ్చే మంచిచెడులు సమంగా స్వీకరించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కష్టసుఖాలు సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని సూచించారు. కొత్త ఏడాదిలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు రావాలని అన్నారు.