calender_icon.png 22 March, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలి

21-03-2025 08:33:46 PM

కొండపాక: ఎండిపోతున్న పంట పొలాలు ఏడుస్తున్న రైతుల బాధలు చూడలేక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామగుండం నుంచి పాదయాత్ర చేస్తున్న కోరుకంటి చందర్ కు శుక్రవారం దుద్దెడ సబ్ స్టేషన్ దగ్గర కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ తో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికికారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్, వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి  నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించామని తెలిపారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించారని, రైతుబంధు డబ్బులు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కెసిఆర్  కావాలని  ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.అనంతరం ర్యాలీగా దుద్దెడ నుంచి కొడకండ్ల వరకు పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.