హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister KCR), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఎర్రవల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనలోని తప్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్(Telangana BC Commission) సభ్యులుగా శుభప్రద్ పటేల్ తమిళనాడులో పర్యటించిన సందర్భాలను గుర్తు చేశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) గురించి తెలిపే పుస్తకంతో పాటు 69 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలను కేసీఆర్‌కు అందజేశారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని కేసీఆర్ శుభప్రద్ పటేల్‌కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress Govt) 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదని, దాని అమలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలను సమాయత్తం చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు, వారి సంక్షేమం కోసం గత పదేళ్లుగా పార్టీ, ప్రభుత్వం విశేష కృషి చేసిందని కేసీఆర్(KCR) గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే వారికి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యమ పంథాను ముందుకు తీసుకెళ్లాలని సూచించడంతో పాటు పార్టీ అండగా ఉంటుందని శుభప్రద్ పటేల్(Subhaprad Patel)కు కేసీఆర్ ధైర్యం చెప్పారు.