calender_icon.png 22 April, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్

22-04-2025 12:17:24 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముంబైకి చెందిన నటి జెత్వానీ దాఖలు చేసిన వేధింపుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)అరెస్టు చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సిఐడి పిఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్ నుండి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం తదుపరి విచారణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసే ప్రక్రియలో ఉంది. అతనిపై వచ్చిన ఆరోపణలపై సీఐడీ సమగ్ర విచారణ నిర్వహించే అవకాశం ఉంది. పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. మాజీ సీఎం జగన్ కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన సర్వీసు నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కుక్క విద్యాసాగర్ నటి జత్వానీకి వ్యతిరేకంగా తన ఆస్తిపై తప్పుడు ఒప్పంద పత్రాల్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో ఫిర్యాదు చేశాడు దీంతో, జత్వానీని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు ముంబాయి వెళ్లి వారిని అరెస్టు చేసి విజయవాడ రాపించారు. విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ నటి కుటుంబాన్ని రిమాండ్ కు తరించే వ్యవహారాలను పర్యవేక్షించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత వైసీపీ హయాంలో అధికారలు తమపట్ల వ్యవహరించిన తీరుపై నటి జత్వానీ ఫిర్యాదు చేయడంతో విద్యాసాగర్ తో పాలు పీఎస్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ అయ్యారు.