calender_icon.png 14 March, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మేషన్ రోడ్డు పనులు పూర్తి చేయాలి

11-03-2025 05:29:12 PM

ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్...

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఫార్మేషన్ రోడ్డు పనులను ఉపాధి హామీ కార్మికులు పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ సూచించారు. మంగళవారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని బిక్కనూరు గ్రామంలో గత కొన్ని రోజుల నుండి కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ గ్రామ స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు.

గ్రామంలో పంట కాలువల వెంబడి ఉన్న చిన్నపాటి ఫార్మేషన్ రోడ్డు కబ్జాకు గురైందని దాని పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారని, ఈ విషయమై సర్వే చేపట్టడానికి వీలుగా తహసిల్దార్ కు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. అలాగే ఉపాధి హామీ కూలీల హాజరును పరిశీలించడం జరిగిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్ణయించిన కొలతల ప్రకారం పనులు చేసుకోవాలని కూలీలకు సూచించారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ భాగయ్య మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామ పొలిమేరలోని స్మశాన వాటిక మీదుగా నూరుగంటి రాళ్ల ప్రాంతం వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న, మాజీ ఉపసర్పంచ్ గోనె శ్రీకాంత్, కరోబార్ రాజు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.