calender_icon.png 4 October, 2024 | 2:55 PM

తిరుమల లడ్డూ అంశంపై పొలిటికల్ డ్రామాలొద్దు

04-10-2024 11:14:13 AM

న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ అంశంపై పొలిటికల్ డ్రామగా మారవద్దని కోరుకుంటున్నామని సుప్రీం కోర్టు వెల్లడించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తం అంశాన్ని తాను పరిశీలించానని ఎస్ జీ తుషార్ మెహతా తెలిపారు. సెట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేదుని ఎస్ జీ వెల్లడించారు. వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదన్నారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని తుషార్ మెహతా పేర్కొన్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతోందన్నారు.

స్వతంత్ర సెట్ ఏర్పాటుకు సిఫారసు చేస్తున్నామని జస్టిస్ గవాయి వెల్లడించారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లడ్డూ కల్తీపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సూచిస్తున్నామని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. సిట్ లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది.