హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావుపై కేసు నమోదైంది. కూకట్పల్లిలోని 340 ఎకరాల ఆస్తికి సంబంధించిన పత్రాల తయారీలో పలువురు వ్యక్తులకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం భుజనాగరావుపై కేసు నమోదు చేసింది. కూకట్ పల్లి ఏసీపీగా ఉన్నప్పుడు బెదిరించారని భుజంగరావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతిని కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు.