ముంబై, డిసెంబర్ 20: విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడులు తరలిస్తున్న నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు మరింతగా క్షీణించా యి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 13తో ముగిసిన వా రంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. సెప్టెంబర్ చివరినాటి రికార్డు గరిష్ఠస్థాయి 704.885 బిలియన్ డాలర్ల నుంచి ఇప్పటివరకూ 52 బిలి యన్ డాలర్లు క్షీణించాయి.
తాజాగా డిసెంబర్ 13తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 3.047 బిలియన్ డాలర్లు క్షీణించి 562.576 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. రూపాయి పతనాన్ని నిరోధించేందుకు రిజర్వ్‌బ్యాంక్ డాలర్లు విక్రయించడం కూ డా విదేశీ కరెన్సీ తగ్గుదలకు కారణం. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరు తో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
పెరిగిన బంగారం నిల్వలు
ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు మాత్రం సమీక్షావారంలో 1.121 బిలియన్ డాలర్లు తగ్గి 68.056 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 35 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 17.997 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.24 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.