హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): ఫరెవర్ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఫరెవర్ మిసె స్ యూనివర్స్ తెలంగాణ విజేతగా సంగీతా కపట్ నిలిచి కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024 డిసెంబర్ 21న జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఆమె నైపుణ్యాన్ని ప్రదర్శిం చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోటీదారుల్లో సంగీత విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ టైటిల్ గెలవడంతో తన కల సాకారమైందని, తెలంగాణకు ప్రతినిధిగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్‌గా సంగీతా కపట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అంతకు ముందు డిసెంబర్ 20న జరిగిన పరెవర్ ఫ్యాషన్ వీక్‌లో సంగీ త అద్భుత ఆరంబాన్నిచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫరెవర్ మిసెస్ యూనివర్స్ తెలంగాణ, ఫరెవర్ ఫ్యాషన్ వీక్‌ను ప్రముఖ శీ లోబో కొరియోగ్రఫీ చేయగా, ఉత్తమ్ భగత్, వినుమిశ్ర సమకరించారు.