ఫుడ్
జీవితాతం హాయిగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆయుష్షు ఎంత ముఖ్యమో, మంచి ఆరోగ్య జీవన విధానం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం, మంచి నిద్రతోపాటు హెల్దీ డైట్ చాలా అవసరం. కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా
ప్రోటీన్స్ మస్ట్..
ఎక్కువ ప్రోటీన్ తీసుకునేవారు ఎక్కువ కాలం జీవిస్తారని, తక్కువ తినేవారి తక్కువకాలం జీవిస్తారని పరిశోధకులు సైతం తేల్చి చెప్పారు. చిక్కుళ్ళు, తృణధాన్యాలు, ఆకుకూరలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయి. అయితే బిజీ లైఫ్‌లో చాలామంది ప్రాసెస్ ఫుడ్ తింటున్నారని, వాటిల్లో ఉండే తక్కువ ప్రోటీన్స్ అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నార్వేలోని బెర్గెన్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ లార్స్ ఫాడ్నెస్ స్పష్టం చేశారు. బలమైన కండరాలు, ఎముకల బలానికి ప్రోటీన్ కీలకమని, ఇది వృద్ధులకు చురుకుగా ఉంచుతుందని చెప్పారు.
ఆ పోషకాలు అవసరం
శరీరంలో ఎముకల బలానికి తగినంత కాల్షియం, విటమిన్ డి కచ్చితంగా అవసరం. పాలు, నారింజ జ్యూస్, పెరుగు, జున్ను లాంటివాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇక విటమిన్ డి సూర్యరశ్మి నుంచి కూడా పొందొచ్చు. చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు లాంటి శరీరానికి కావాల్సిన అదనపు పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఇవన్నీ దినచర్యలో భాగం చేసుకోవాలి.
యాంటీఆక్సిడెంట్
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు, ఇతర చిక్కుళ్లలో పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్, నిరోధక సమ్మేళనాలు ఆరోగ్యమైన వృద్ధాప్యానికి తోడ్పడుతాయి. రోజుకు మూడు నుండి ఐదు కప్పుల పాలీఫెనాల్స్ తాగడం టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు లాంటివాటికి చెక్ పెట్టొచ్చు. గ్రీన్ టీ కూడా హెల్త్‌కు మంచిది.
ఆరోగ్యకరమైన కొవ్వులు
ఆలివ్ ఆయిల్, ఇతర మొక్కల నూనె లు, కాయలు, విత్తనాలు, అవోకాడోలో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే కొవ్వులు అసలు మంచిది కావు. చేపలు, గుడ్లు లాంటివి తీసుకోవాలి. ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా మంచిచేస్తాయి.