అటవీ సమీప గ్రామాల వారు తగు జాగ్రత్తలు పాటించాలి: ఎఫ్ఆర్ఓ
బోథ్,(విజయక్రాంతి): అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేరడిగొండ అటవీ శాఖ అధికారి గణేష్ పేర్కొన్నారు. ఆదివారం రోజున పులి సంచరిస్తుందన్న వార్తలతో నేరడిగొండ రేంజి పరిధిలోని పట్టణ సమీప ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పశువులను మేపేందుకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా వెళ్లాలని పొలం పనులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలకు ముగించుకోవాలన్నారు.
పశువులను మేపేందుకు అడవిలో పనికి వెళ్లరాదని అంతేగాక వివిధ గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతం గుండా వెళ్లే దారులు ఉపయోగించవద్దన్నారు. పులి యొక్క పాదముద్రలు ఆనవాళ్లు కనిపిస్తే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని గుడికి ఎలాంటి హాని చేయవద్దని ఉచ్చులు కరెంటు తీగలు వలలు పెట్టవద్దన్నారు. హాని కలిగించిన వ్యక్తులపై అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.






