ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, జనవరి 1: ఒత్తిడితో కూడిన జీవనం నుండి ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పట్టణ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల అర్బన్ మండలం అంబారీపెట్ గ్రామ ఫారెస్ట్లో నగర్ వన యోజన కార్యక్రమం లో భాగంగా రూ. 2కోట్ల తో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యా ల పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలకు ప్రశాంతమైన పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావ రణం కోసం నగర్ వన యోజన కార్యక్రమంలో భాగంగా అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తున్నా మని అన్నారు. జగిత్యాల పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో 400 ఎకరాలలో విస్తరించి ఉన్న అంబర్ పేట్ పరిసర ఫారెస్ట్ ప్రాంతం జగిత్యాల ప్రజలకు కనువిందు చేయనుందన్నారు.
అర్బన్ పార్కులో వా టవర్, సోలార్ బోర్ పంపులు, పగోడా వివిధ జంతువుల చిత్రాల తదితర వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జగిత్యాల పట్టణ ప్రజలకు కాంక్రీట్ జంగిల్ నుండి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సమాజంలో నేటి పిల్లలకు అడవులపై అవగాహన తప్పనిసరి అవసరమన్నారు.
ఏకో టురీజం, మున్సిపల్, సీడీపీ, కలెక్టర్ తదితర నిధులతో పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జనవరి 20 వరకు ఈ పార్కును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.