calender_icon.png 5 February, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ ప్రాంతంలో సర్వే చేపట్టిన ఫారెస్ట్ అధికారులు

04-02-2025 11:18:11 PM

రామాయంపేట: రామాయంపేట మండలంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో హైదరాబాద్ స్పెషల్ పార్టీ ఫారెస్ట్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేట, తోనిగండ్ల అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు హైదరాబాద్ స్పెషల్ పార్టీ పారెస్ట్ అటవీ అధికారి ప్రవీణ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన్య ప్రాణుల సంరక్షణ కోసం రోడ్డు అవతలి వైపు నుండి ఈవతల వైపుకునకు వన్యప్రాణులు వెళ్లేందుకు అండర్ పాసులు నిర్మాణం చేపట్టే విధంగా తాము జాతీయ రహదారి అధికారులు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా వన్యప్రాణులను రక్షించేందుకు తాము రేంజ్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాలలో వన్యప్రాణులకు అటవీ ప్రాంతం చుట్టు ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాటిని సంరక్షించే దిశగా తాము అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఆమె వెంట మెదక్ డీఎఫ్ఓ జోజి, రేంజ్ అధికారి మనోజ్ కుమార్, రామాయంపేట పారెస్ట్ రెంజ్ అధికారి విద్యాసాగర్, సాంకేతిక నిపుణులు మహేందర్, టీమ్ ఆర్ అండ్ బి అధికారులు, పారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.