29-04-2025 10:43:48 PM
పేదల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి...
నిమ్మల రాంబాబు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరులో పోడు భూముల సమస్యపై జనరల్ బాడీ సమావేశం మంగళవారం వేములపల్లి శ్రీనివాస్ (వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ... పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారుల బెదిరింపులు నిలిపివేయాలని, పొడుసాగు చేస్తున్న రైతులకు పట్టాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల నుండి గిరిజన, గిరిజన పేదలు, వలస ఆదివాసి పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు గత ప్రభుత్వం సర్వే నిర్వహించి, పట్టాలు ఇవ్వలేదన్నారు.
దీంతో పోడు సాగుదారులకు ఫారెస్ట్ అధికారులతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పట్టాలు లేని భూములను గుంజుకుంటామని. అట్టి భూములు ఎవరు సాగు చేయడానికి వీలులేదని ఫారెస్ట్ అధికారులు బెదిరి ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి. పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గతంలో సర్వే చేసిన భూములకు ఫారెస్ట్ అధికారులు ఎటువంటి అభ్యంతరం తెలపవద్దన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పాల్వంచ మండల అధ్యక్షులు కొంగర అప్పారావు పార్టీ ఉలవనూరు శాఖ కార్యదర్శి నిట్టా అమృత రావు, ప్రజా సంఘాల నాయకులు వజ్జా వాసు నిట్టా ప్రసాద్, జార్జి, సోనీ, బీమా, మనోజ్, దేవ, లక్ష్మయ్య, భద్యా నాయక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.