18-02-2025 02:36:03 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని కొమరారం లో ఏసీబీ డిఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. కొమరారం అటవీ శాఖ రేంజ్ అధికారి ఉదయ్ కుమార్, ఎఫ్బీఓ నూనావత్ హరిలాల్ లు రూ.30 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ రూ.30 వేల డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించడంతో కొమరారం రేంజ్ కార్యాలయం(Komararam Range Office)లోనే ఇద్దరినీ పట్టుకొని విచారణ చేస్తున్నారు.