పశువులతో నిరసనకు దిగిన గ్రామస్థులు
మంచిర్యాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : జిల్లాలోని జన్నారం మండలం ఇందన్‌పల్లిలో ఫారెస్టు అధికారులు పశువుల కాపరిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఉద ఇందన్‌పల్లి రేంజ్ కార్యాలయం ముందు పశువులను నిలిపి గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.
పశువులను మేపేందు వెళ్లిన కాపరి గోపాల్‌పై ఎఫ్‌ఎస్‌ఓ అధికారి రుబీనా అకారణంగా దాడి చేశారంటూ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జన్నారం ఎస్సై రాజ్‌వర్ధన్, ఎఫ్‌ఆర్‌ఓ కారం శ్రీనివాస్ అక్కడకి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.