calender_icon.png 15 March, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారి

17-12-2024 12:33:17 AM

కోరుట్ల, డిసెంబర్ 16: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి అఫీసొద్దీన్ సోమవారం సాయంత్రం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నరికిన మామిడి చెట్ల కర్రలు తరలించడానికిగానూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన పల్లపు నరేశ్ ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్‌వోసీపై సంతకం కోసం రూ.4,500 ఇవ్వాలని అఫీసొద్దీన్ డిమాండ్ చేశాడు. దీంతో నరేశ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సూచనతో సోమవారం సాయంత్రం లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అఫీసొద్దీన్‌ను రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు.