ఉత్తర్వులు జారీ చేసిన అటవీ, పర్యావరణ శాఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మెదక్ అటవీ డివిజన్ పరిధిలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్‌కు 0.0477 హెక్టార్ల భూమి కేటాయిస్తూ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఆహ్మద్ నదీం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రాహింపూర్ రామాయంపేట పరిధిలో బోనాల నుంచి శివాయంపల్లి రోడ్డుపై భూ బదిలికి అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే భూ బదిలి చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేళ్ల వరకు ఈ అనుమతి ఉంటుందని, సదరు సంస్థ నిర్మాణాలు చేపట్టకపోతే అనుమతి రద్దవుతుందని వెల్లడించారు.