22-03-2025 06:00:53 PM
సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు విషయమై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడిఓసి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం, మహాదేవపూర్ మండలాల్లో ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు, అలాగే రేగొండ మండలంలో బుద్దారం నుండి రామన్నగూడెం తండా వరకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపు విషయమై అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్ అండ్ బి, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కుసుమ కుమారి, ఈ ఈ యాదగిరి, తహసీల్దార్లు, మెగా ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.