calender_icon.png 27 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ కుంట కబ్జా!

27-12-2024 12:00:00 AM

  • వట్టిమల్ల గొల్లపల్లిలో కబ్జాదారుల పాగా
  • కుంటను చదును చేస్తున్న కబ్జాదారులు
  • కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న అటవీ అధికారి
  • అటవీ భూముల్లో బోర్లు వేస్తున్న పట్టని అధికారి
  • ఉన్నతాధికారులు కుంటను కాపాడాలంటున్న స్థానికులు

కోనరావుపేట, డిసెంబర్ 26 : అటవీ సంపదంతా కబ్జాదారుల కొరల్లోకి వెళ్లిపో తుంది. అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. దగ్గర ఉండి మరి అటవీ భూమిని చదును చేసేందుకు సహకరిస్తున్నా రని ఆరోపణలు ఉన్నాయి. కాసులకు కక్కుర్తి పడి, అటవీ సంపదను కబ్జాదా రులకు అంటగడుతున్నారు. భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అటవీ సంపదను ఇప్పుడే నాశనం చేస్తే, రానున్న రోజుల్లో మానవ మనుగడ ప్రశ్నారార్థకమవుతుం దనీ పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాంటిది ఏకంగా అటవీ కుంటను కొందరు కబ్జాదారులు మూడు రోజులుగా యంత్రాలతో చదును చేస్తున్న అటవీ అధికారులు చోద్యం చూస్తున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల-గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వేములవాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వ చ్చే ఈ అటవీ ప్రాంతమంతా అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అటవీ సంపదను పరిరక్షించాల్సిన అటవీ అధి కారులు పట్టించుకోకపోవడంతోనే భూము ల్లో కబ్జాదారులు పాగా వేస్తున్నారు.

-2002లో కుంటకు మరమ్మతులు

వట్టిమల్ల -గొల్లపల్లి గ్రామాల్లో వైకుంఠ దామం పక్కన ఉన్న బూరవ్వ కుంటకు 2002లో మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ కట్ట మరమ్మతులకు అప్పటి ప్రజాప్రతి నిధులు జెట్టి అంజయ్య, గోపు పర్శరాము లు పనులు చేపట్టారు. 15 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న బూరవ్వ కుంటకు మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగడంతోపాటు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు దోహపడింది.

అంతేకాకుండా అక్కడ ఉన్న పంట పొలాలకు సాగు నీరం దించింది. ఇన్ని రోజులు సక్రమంగా ఉన్న కుంటపై కొందరి కబ్జాదారుల కన్నుపడిం ది. ఇదే అదునుగా భావించి యంత్రాలతో మూడు రోజులుగా కుంటను చదును చేసి, దాని అనవాలు లేకుండా చేస్తున్నారు. ఇదంతా అటవీ అధికారికి తెలిసినప్పటికి, పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

కబ్జాదారులకు అటవీ అధికారి అండ

అటవీ సంపదను పరిరక్షించాల్సిన అధికారే, కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నా డు. వేములవాడ రేంజీ పరిధిలో ఉన్న వట్టి మల్ల, గొల్లపలి, బావుసాయిపేట గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతమంతా అన్యాక్రాంతమవుతున్నప్పటికి పట్టించు కుంటలేడనే ఆరోపణలు ఉన్నాయి. పరుల పాలుకాకుండా అటవీ సంపదను కాపా డాల్సిన సదరు అటవీ అధికారి దగ్గర ఉండి మరి కబ్జాదారులకు అండగా నిలుస్తు న్నాడనే ఆరోపణలు బహిరంగానే వినిపి స్తున్నాయి.

బావుసాయిపేటలో సైతం కొద్ది రోజుల క్రితం బండపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అటవీ భూమిని చదును చేసినప్పటికి, పట్టించుకో లేదని, వట్టిమల్ల అటవీ ప్రాంతంలో బోరు బావులు వేస్తున్న పట్టికి, ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి, అటవీ సంపదను అన్యా క్రాంతం, కబ్జాదారులకు కొరల్లో చిక్కకుండా చూడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. 

కబ్జా చేస్తే కఠిన చర్యలు

అటవీ భూములు ఎవరైనా అక్రమి స్తే కఠిన చర్యలు తప్పవు. వట్టిమల్ల గొల్లపల్లిలో ఉన్న బూరవ్వ కుంటను చదును చేస్తే వెంటనే చర్యలు తీసుకుం టాం. చదును చేసిన వారికి తమ సిబ్బంది సహకరిస్తే, వెంటనే విచారణ చేపట్టి శాఖ పరంగా చర్యలు తీసుకుం టాం. కుంట చుట్టూ కంచె ఏర్పాటు చేసి, ఇతరుల పాలు కాకుండా అటవీ కుంటను కాపాడుతాం. కుంటను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుం టాం. అక్రమాలకు పాల్పడితే వదిలి పెట్టే ప్రసక్తి లేదు.

 ఖలీలొద్దీన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వేములవాడ