calender_icon.png 5 March, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవిలో కార్చిచ్చు

05-03-2025 12:42:50 AM

వేసవి కాలంలో అడవిలో అగ్ని ప్రమాదాలు

ముందు జాగ్రత్త చర్యలపై అటవీశాఖ అధికారుల దృష్టి.

క్విక్ రెస్పాన్స్  బృందాల ఏర్పాటు

శాటిలైట్ సహాయంతో  ప్రమాదాల గుర్తింపు

చింతగూడ అడవుల్లో నెలకొన్న కార్చిచ్చు

ఆదిలాబాద్, మార్చ్ 4 (విజయ క్రాంతి) : అడవుల జిల్లా ఆదిలాబాద్ లో వేసవి కాలం వచ్చిందంటే చాలు దట్టమైన అడవిలో కార్చిచ్చు (అగ్ని ప్రమాదాలు) జరిగే ఆస్కారం ఉంటుంది. ఆకు రాలే కాలంలో అడవులకు అగ్నిప్రమాదాల ముప్పు ఎలా ఉంటుందో ఇటీవల అమెరికా లోని లాస్ ఏంజెల్స్ జరిగిన ప్రమాదాన్ని చూశాము. అడవుల్లో కార్చిచ్చు ఫలితంగా విలువైన వృక్ష సంపద, అరుదైన జీవ జాతులు అంతరించిపోతుంటాయి. వనాన్ని అవాసంగా మలచుకున్న జీవరాశుల మనుగడే ప్రమాదం నెలకొంటుంది. అలాం టి నష్టాన్ని అరికట్టేందుకు అదిలాబాద్ అటవీ శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

అదిలాబాద్ ఆటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల రక్షణకు అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు చెవుడుతున్నారు. అదేవిధంగా వేసవి ఆరంభంలోనే అడవుల్లో మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకునేందుకు ఫారెస్ట్ సిబ్బందికి సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అటవీ శాఖ చేపడుతున్న ఈ జాగ్రత్తలతో జిల్లా అడవుల్లో నిప్పు, ముప్పు తప్పిందనే అవకాశాలు ఉన్నాయి. అయిన తాజాగా సోమవారం రాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలం చింత గూడ అడవుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే ఎస్పీ గౌష్ అలం  ఫైర్ సిబ్బంది ని అప్ర మత్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. 

 అడవుల్లో అగ్ని ప్రమాదాలు....

ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే కాలం, కిందపడిన ఆకులు ఎండిపోవడంతో పాటు కుప్పలుగా కుప్పలుగా కనిపిస్తుం టాయి. ఈ పరిస్థితుల్లో వాటి పై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోంది. ఏ మాత్రం చిన్న నిప్పు అంటుకున్నా మంటలు చెలరేగుతుంటాయి. ఆకులు రాలే వేసవిలో ఇలాంటి ప్రమా దాలు నిత్యకృత్యంగా మారుతాయి. విలు వైన కలప కాలిపోవడంతో పాటు వన్యప్రా ణులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటాయి. పచ్చని చెట్లు నేల మట్టమవ్వడమే కాకుండా సర్వరోగ నివారిణిగా పేరుగాంచిన ఔషద మొక్కలు కాలి బుడిదవుతాయి. 

అడవుల్లో అగ్ని ప్రమాదాలకు కారణాలు...

జిల్లా విస్తీర్ణంలో 44 శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 9 ఆటవీ రెంజ్ పరిధిలో విస్తరించి ఉంది. సాధారణంగా జిల్లాలో టేకు వృక్షాలు అధి కంగా ఉండటంతో వేసవిలో ఆకులు ఎండి పోయి నెలారాలుతాయి. అడవుల్లో వన భోజనాలు చేసినటువంటి వారు వంటలు వండిన తర్వాత మంటలను పూర్తిగా చల్లరప కపోవడం, అదేవిధంగా అడవుల్లో వన్యప్రా ణులు పరుగెడుతున్నప్పుడు రాళ్ల రాపిడి ద్వారా మంటలు చెలరేగే అవకాశం ఉంటుం ది. అటు అడవుల్లో సంచరించేవారు పొగ తాగి బీడీలు, సిగరెట్లు చల్లారపకుండా పార వేయడంతో మంటలు చెలరేగడంతో నిప్పం టుకుని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉం టుంది. చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడ విలో మంటలు దావనంలా వ్యాపిస్తోంది.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు...

వేసవి కాలంలో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలకు అడుకట్ట వేసేందుకు, ప్రమా దాలను ఎక్కడికక్కడ నిలువరించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో వృక్ష సంపదతో పాటు వన్యప్రాణులను కాపాడు కునేందుకు అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. ఫారెస్ట్ రెంజ్ లు, సెక్షన్ లు, బీట్ ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ అగ్గి రాజుకున్న శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి, మంటలను ఆర్చివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

మరోవైపు ముందస్తుగా అడవుల్లో ఫైర్ లైన్స్ తో అగ్ని ప్రమాదాల కట్టడి చేస్తున్నారు. అడవిలో పడిన ఆకులను బ్లోయర్ ల సహాయంతో దూరం చేయడంతో నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించకుండా చర్యలు. నేల రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి కిలో మీటర్ పొడవున మంట పెడుతున్నారు. దీంతో నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్ లైన్స్ ఉపయోగపడుతాయి. 

ప్రమాదాల నివారణకు శాటిలైట్ సేవలు...

వేసవి కాలంలో అడవుల్లో కార్చిచ్చు నివారణకు శాటిలైట్ సేవలు వినియోగిం చనున్నాం. అడవుల్లో కార్చిచ్చు జరిగిన వెంటనే అలర్ట్ చేసి 15 నిమిషాల్లోనే మంటలు ఆర్పేల చర్యలు తీసుకుంటు న్నాం. సమీప గ్రామాల ప్రజలకు అవగాహనతో టోల్ ఫ్రీ నెంబరుతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫైర్ లైన్స్ ఏర్పాటుతో ఒకచోట నుంచి మరోచో టకు మంటలు వ్యాపించకుండా చర్యలు చెప్పటం. అటవీ సంరక్షణకు నిరంతరం గస్తీ ముమ్మరం చేశాం.

 డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్