- ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట రూట్‌కు వేగంగా భూసేకరణ
- ఇప్పటి వరకు దాదాపు 700 ఆస్తుల సేకరణ?
- జనవరిలో పనులు మొదలయ్యే అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొట్రో ఫేజ్ పనుల్లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించబోతున్న ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ పనుల్లో మరో ముందడుగు పడింది.
ఈ కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం మెట్రో రైల్ సంస్థ గతంలోనే నోటీసులు ఇవ్వగా.. తాజాగా శనివారం 200 ఆస్తుల భూసేకరణకు సంబం ధించిన డిక్లరేషన్‌కు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు 700 ఆస్తుల సేకరణకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది ఈ ఆస్తుల సేకరణ పూర్తయితే డిసెంబర్ నెలాఖరున అవార్డులు (నష్ట పరిహారం) ఇచ్చే ఛాన్స్ ఉంది.
హైదరాబాద్ మెట్రో ఆరో కారిడార్(ఓల్డ్‌సిటీ)లో చేపట్టబోయే ఈ పనులు జనవరిలో షురువయ్యే అవకాశం ఉంది. కాగా ఇటీవల రూ.24,269 కోట్ల అంచనాలతో మెట్రో ఫేజ్ 5 కారిడార్ల నిర్మాణం కోసం డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం పరిపా లన అనుమతులు ఇచ్చిన విష యం తెలిసిందే. ఈడీపీఆర్‌లకు కేం ద్రం నుంచి అనుమతులు రాగానే పనులు చేపట్టే అవకాశం ఉంది.
మొత్తం 1200 ఆస్తుల సేకరణ
ప్రస్తుతం పరేడ్‌గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ కారిడార్ కొనసాగిం పుగా ఓల్డ్‌సిటీ కారిడార్ 6ను నిర్మించబోతున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉంటుంది. అక్కడి నుంచి ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఉంటుం ది. ఈ రూట్‌లో మొత్తం 1,200 ఆస్తులు ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు.
ఈ కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకా రం అధికారులు నోటిఫి కేషన్లు జారీ చేశారు. ఆగస్టు నాటికి 400 ఆస్తులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఇటీవల మరో 300 ఆస్తులకు నోటిఫికేషన్ జారీ చేశారు. వాటి లో దాదాపు 200లకు పైగా ఆస్తుల విషయంలో ఎలాం టి అభ్యంతరాలు రానట్లు తెలుస్తోంది.
మిగతా ఆస్తుల విషయంలోనూ అభ్యంతరాలు లేకుంటే దాదాపు 700 ఆస్తుల సేకరణ పూర్తవుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు మిగతా ఆస్తుల భూసేకరణ పనులను పూర్తి చేసి జనవరిలో పనులు చేపట్టే అవకాశం ఉంది.
కాగా ఈ రూట్‌లో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, అతి సున్నితమైన నిర్మాణాలున్నట్లు మెట్రో అధికారులు గుర్తించారు. వాటికి ఇబ్బందులు కలుగకుండా ఆరో కారిడార్‌ను నిర్మించబోతున్నా రు. ఈ రూట్‌లో రోడ్డు మధ్య నుంచి 100 అడుగులు, మెట్రో స్టేషన్ల వద్ద 120 అడుగుల మేర రోడ్డును విస్తరించబోతున్నారు.
ఏడు స్టేషన్లు.. 7.5 కిలోమీటర్లు
ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ నిర్మాణం కోసం ఈ ఏడాది మార్చి 8న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఓల్డ్ సిటీ మెట్రోను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు కూడా కేటాయించారు. ఎంజీబీఎస్ మధ్య 7.5 కిలోమీటర్ల మేర నిర్మించబోయే ఈ కారిడార్‌లో 6 మెట్రోస్టేషన్లను ఏర్పా టు చేయనున్నారు.
ఇందుకోసం దాదాపు రూ.2,800 కోట్లు ఖర్చవుతుందని మెట్రో అధికారులు ప్రభు త్వానికి సమర్పించిన డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఎంజీబీఎస్, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలి బండ, అలియాబాద్, ఫలక్‌నామా, చాంద్రాయణగుట్ట స్టేషన్లు ఉంటాయి.