calender_icon.png 22 September, 2024 | 2:01 AM

విదేశీ విద్యార్థులకు.. కెనడా షాక్!

19-09-2024 03:31:18 PM

కెనెడియన్ ఫెడరల్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు ఒక షాకింగ్ న్యూస్.. అంతర్థాతీ విద్యార్థులను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగా 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం తగ్గిస్తారు. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు , పౌరసత్వం కెనడా (ఐ ఆర్ సీసీ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు  పేర్కొన్నారు. 2026లో సైతం అలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో దాదాపు 3,60,000 అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్లను ఆమోదించనున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్ల మందిని అధిగమించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల నేప‌థ్యంలో ఐఆర్‌సీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాత్కాలిక నివాసితుల సంఖ్యపై ప‌రిమితులు విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. త‌ద్వారా 2026 నాటికి కెనడా మొత్తం జనాభాలో 6.5 శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాల‌ని లక్ష్యంగా  పెట్టుకుంది.