calender_icon.png 8 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధవనంలో విదేశీ పరిశోధకులు

04-01-2025 12:26:54 AM

నల్లగొండ, జనవరి 3 (విజయక్రాంతి): ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని శుక్రవారం పలువురు విదేశీ బౌద్ధ పరిశోధకులు సందర్శించారు. న్యూజిలాండ్‌కు చెందిన బౌద్ధ ప్రదర్శనశాలల నిపుణుడు ప్రొఫెసర్ సారా కెన్డర్ లైన్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషాతోపాటు హాంకాంగ్‌కు చెందిన మరో ఇద్దరు పరిశోధకులు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డితో కలిసి తిలకించారు. మహాస్థూపం, స్థూపవనం, జాతన వనం, చరిత వనంతోపాటు వివిధ శిల్పాలను పరిశీలించారు. వారివెంట బుద్ధవనం అధికారులు దమ్మచారి, రవిచంద్ర, డీఆర్ శ్యాంసుందర్‌రావు, సిబ్బంది విష్ణు ఉన్నారు.