calender_icon.png 26 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్‌లో ఫారిన్ జాబ్ మేళా

26-10-2024 12:45:22 AM

  1. నిరుద్యోగులకు శిక్షణతోపాటు జాబ్స్
  2. దేశాల వారీగా స్టాల్స్ ఏర్పాటు
  3. టాంకాం ప్రతినిధులతో మంత్రి పొన్నం సమావేశం
  4. ఎన్‌రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా యువతకు పిలుపు

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి) ః తెలంగాణ యువత అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందేలా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సచివాలయంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి, వారి స్కిల్స్ ఆధారంగా విదేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా ఫారిన్ జాబ్ మేళాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబర్ మొదటి వారంలో జరిగే జాబ్ మేళా గురించి యువతకు అవగాహన కల్పించాలంటూ కరీంనగర్, హన్మకొండ, సిద్ధిపేట కలెక్టర్లను ఆదేశించారు.

ప్రతి గ్రామంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగుల నుంచి డేటా సేకరించి విదేశాల్లో వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా చొరవచూపాలనని సూచించారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందన్నారు. 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్, కెనడా, గల్ఫ్ దేశాలు, యూఎస్‌ఏ, యూకే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే టాంకాం ద్వారా శిక్షణ తీసుకున్న వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు పొందినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. సమావేశంలో ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరీ, టాంకాం సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, టాంకాం జీఎం నాగభారతి, టాంకాం మేనేజర్ షబ్నా తదితర అధికారులు పాల్గొన్నారు. 

టీఎన్‌జీవో జేఏసీలోకి ఆర్టీసీ జేఏసీ 

టీఎన్‌జీవో జేఏసీలో ఆర్టీసీ జేఏసీ భాగస్వామ్యమైనట్లు చైర్మన్ వెంకన్న శుక్రవారం ఒక ప్రకనటలో తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం టీఎన్‌జీవోతో కలిసి పనిచేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల అంశాలను, విధివిధానాలను చర్చించాక ఇరువురి జేఏసీ నాయకుల అభిప్రాయంతో టీఎన్‌జీవోలో చేరినట్లు చెప్పారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయండి 

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జేఏసీ వినతి 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఆర్టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తామ ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరా రు. శుక్రవారం మంత్రి పొన్నంను ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న నేతృతంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

గత ప్రభుత్వం   ట్రేడ్ యూనియన్లను రద్దు చేసిం దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చా క ట్రేడ్ యూనియన్లను పునరి ద్ధరిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. మంత్రిని కలిసి న వారిలో జేఏసీ నాయకులు థా మస్‌రెడ్డి, ఎండీ మౌలానా, యాద య్య, సురేశ్, యాదగిరి తదితరులు ఉన్నారు.