calender_icon.png 30 September, 2024 | 1:58 PM

హెల్త్ టూరిజంపై విదేశాల ఆసక్తి

30-09-2024 02:09:28 AM

తెలంగాణతో ఒప్పందానికి సిద్ధమవుతున్న బంగ్లాదేశ్

ఢిల్లీలో రెసిడెంట్ కమిషన్‌తో ఆ దేశ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

తెలంగాణకు వస్తున్న విదేశీ టూరిస్టుల్లో అధిక భాగం హైదరాబాద్‌కే..

టూరిస్టు వీసాలతో వచ్చి రాజధానిలో వైద్యం

మెడికల్ టూరిజం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తీసుకురాను న్న మెడికల్ టూరిజం పాలసీపై పలు దేశా లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోం ది. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్యం అందుతోంది.

గల్ఫ్‌తో పాటు, ఆఫ్రికా దేశాల నుంచి వివిధ వ్యాధుల ట్రీట్‌మెంట్ కోసం రాజధానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను మెడకల్ హబ్ మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో దాదా పు 1,000 ఎకరాల్లో హెల్త్‌సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే, త్వరలోనే మెడికల్ టూరిజం పాలసీని తీసుకురాబోతుంది.

తద్వారా హైదరాబాద్‌ను వైద్య సేవల్లో నెంబర్‌వన్‌గా మార్చే సంకల్పంతో ప్రభుత్వం ముందుకుపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. తాజాగా హెల్త్ టూరిజం, పర్యాటక రంగాల్లో సహకారం కోసం చెన్నులోని బంగ్లాదేశ్  డిప్యూటీ హైకమిషనర్ శెల్లీ సలెహిన్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిశారు.

ప్రపంచ నలుమూలల నుంచి రోగులను ఆకర్షించే ఆరోగ్య సంరక్ష ణ సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన వైద్యులు, అత్యాధునిక సాంకేతికతను హైదరాబాద్ అందిపుచ్చుకోవడం, సరసమైన ధరలకు చికిత్సలు అందించే అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులకు నిలయంగా మారిన విషయా న్ని సలెహిన్‌కు గౌరవ్ ఉప్పల్ వివరించారు.

రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో బంగ్లాదేశ్  డిప్యూటీ హైకమిషనర్ భేటీ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆ దేశం కీలక ఒప్పందం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ లు కుదుర్చుకునేదంకు సిద్ధంగా ఉన్నట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి.  

టూరిజం వీసాల్లో ఎక్కువ మంది వైద్యం కోసమే 

2023లో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలకు 1,60,545 మంది విదేశీ టూరిస్టులు వచ్చినట్లు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. ఇదే సమయంలో 2024లో జూన్ వరకు టూరి స్టు వీసాలతో 67,631 వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ టూరిస్టులను ఆకర్షించడంలో తెలంగా ణ దేశంలో చాలా వెనుకబడి ఉంది.

అయితే రాష్ట్రానికి వచ్చే విదేశీ టూరిస్టులందరూ హైదరాబాద్‌తో పాటు పరి సర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మెజారిటీ శాతం వైద్యం కోసమే వస్తున్నట్లు తెలుస్తోంది. టూరిస్టు వీసాలతో ఇక్కడ వైద్యం చేయించుకొని వెళ్తుంటా రు. హైదరాబాద్‌కు వచ్చే వారిలో ఎక్కు వ శాతం గల్ఫ్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు చెందినవారు అధికంగా ఉన్నారు.

2024లో హైదరాబాద్‌కు 

వచ్చిన విదేశీ టూరిస్టులు

జనవరి 17,083

ఫిబ్రవరి 9,521

మార్చి 12,316

ఏప్రిల్ 8,189

మే 13,769

జూన్ 6,753

మొత్తం 67,631