calender_icon.png 2 January, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు!

10-12-2024 12:00:00 AM

ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఆహారం, ప్రయాణం వేర్వేరుగా భావించలేం. జిహ్వకో రుచి ఉన్నట్టే ప్రాంతానికో రుచి కూడా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రుచికరమైన ఆహార పదార్థాలు ఉంటాయి. జనాలు కూడా వాటికే అలవాటుపడుతారు. అక్కడ దొరికే కూరగాయలు, దినుసుల వల్లనే సరికొత్త రుచులు పుట్టుకొస్తాయి. అయితే చాలామంది విదేశాలకు వెళ్లినప్పుడు స్వదేశీ రుచులుకోసం గాలిస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ దేశ రుచులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్లినప్పుడు ఆ దేశ రుచులను, ప్రత్యేక వంటకాలను కచ్చితంగా ఆస్వాదించాలని చెబుతున్నారు భారతదేశ పాకశాస్త్ర నిపుణులు.

ప్రతి దేశంలో విభిన్న ఆహార అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. వాటిలో ఏ దేశ ఆహార పద్ధతులు ఉత్తమమైనవి అంటే.. కచ్చితంగా భారత దేశానివేనని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. అయితే మనదేశ వంటలు దాదాపుగా ఆరోగ్యకరమైనవితో కూడుకున్నవే. ఆరో గ్య సుగంధ ద్రవ్యాలు, గొప్ప సువాసనగల వంటకాలకు మన దేశం ప్రసిద్ధి చెందినట్లే.. ప్రతి దేశం కూడా ప్రత్యేక వంటకాలకూ పేరుగాంచాయి. అయి తే ఈక్రమంలో మనదేశ శాకాహారులు విదేశాలకు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు.

ఎందుకంటే మనదేశ ఫుడ్‌కు అలవాటు పడినవారు విదేశీ వంటలను ఆరగించడానికి అంతగా ఇష్టపడ రు. విదేశాల్లో వంటల తయారీ చాలా విచిత్రంగా ఉండటమే ఇందుకు కారణం. వియత్నాం, జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో మాంసాహార వంటలు మాత్ర మే ఫేమస్. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం చాలా దేశాలు భారతీయ వంటకాల మాదిరిగా నో రూరించే స్వదేశీ రుచులను పరిచయం చేస్తున్నాయి. 

విదేశాల్లో సంప్రదాయ రుచులు

ప్రపంచవ్యాప్తంగా విదేశీ పర్యటనలు చేసేవారిలో భారతీయులు ముందుంటారు. మనదేశస్తులను దృష్టిలో పెట్టుకొని కొన్ని దేశాలు రుచికరమైన వంటకాలతో రారమ్మని ఆహ్వనిస్తున్నాయి. అయితే విదే శాల్లో చాలా వరకు మాంసాహార వంటకాలే ఉన్నప్పటికీ.. చాలా చోట్లా ఆ దేశ ప్రత్యేక వంటకాలతో ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు ఇటలీలో మార్గరీటా పిజ్జా, పాస్తా ప్రైమవేరా, థాయిలాండ్ ప్యాడ్ థాయ్, గ్రీన్ కర్రీ లాంటివి నోరూరించేలా ఉంటా యి. ఇవన్నీ వెజ్‌తో తయారైనవే. వీటితో పాటు మరికొన్ని రుచులు మనదేశస్తులను ఆకర్షిస్తున్నాయి. అవి ఏమిటంటే.. 

సిగ్ కోఫ్టి: కారంగా ఉన్న టమాటా సాస్‌లో బల్గర్ బాల్స్‌ని నానబెడతారు. టమాటా సాస్‌ని బల్గర్ బాల్స్ పీల్చుకున్న తర్వాత పాలకూర ఆకులు, నిమ్మ చెక్కలు, దానిమ్మ గింజలతో సర్వ్ చేస్తారు. ఈ ఆహారం చాలా ఆరోగ్యకరమైనదని విదేశస్తులు చెబుతారు.

శాక్షుకా: ఈ ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎగ్ ప్లాంట్స్, ఆలు, టమాటాలు ఉంటాయి. ఈ మూడింటినీ టమాట, ఉల్లి పాయ సాస్‌లో బాగా వేయించాలి. ఆ తర్వాత పెరుగుతో కలిపి తింటే ఆ రుచే వేరు.

యాప్రక్ సర్మ: బియ్యము వేయించిన ఉల్లిపాయల మిశ్రమం చుట్టూ వైన్ లీవ్స్ చుట్టి ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.

పింకీ జీ: సిడ్నీలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్ జాబితాలోకి పింకీజీ అనే రెస్టారెంట్ ఎంతోమందిని ఆకర్షిస్త్తోంది. ఎన్నో రకాల భారతీయ వంటకాలను తయారు చేస్తుండటంతో ఆ రెస్టారెంట్‌కు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే అక్కడ దొరికే పానీ పూరికి ‘బాల్స్ ఆఫ్ హ్యాపీనెస్’ అని పేరు పెట్టి మెనూలో చేర్చింది రెస్టారెంట్ యాజమాన్యం. నోరూరించే క్రాబ్ కర్రీ, స్వీట్ కార్న్ ప్యూరీ పింకీ జీ రెస్టారెంట్ స్పెషాలిటీ.

చట్కాజ్: సిడ్నీలోని స్ట్రీట్ ఫుడ్ ప్రియుల ఫేవరెట్ రెస్టారెంట్ చట్కాజ్. అమ్మ చేతి వంటను మరిపించే ఈ వెజ్ రెస్టారెంట్ అన్ని రకాల స్నాక్ ఐటమ్స్‌ను తన మెనూలో చేర్చింది. ఖమన్, డోక్లా, 

ఫారిన్ రిటర్న్: సిడ్నీలోని సర్రీ హిల్స్ క్రౌన్  స్ట్రీట్లో ఉన్న ఫారిన్ రిటర్న్ రెస్టారెంట్.. ఇండియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాల రుచిని ఆ నగరవాసులకు చూపిస్తోంది. వెజ్, నాజ్   వెజ్ వంటకాలతో జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంది. ఈ ఫారిన్ రిటర్న్ రెస్టారెంట్. కాలానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

మన వంటకాలకు డిమాండ్

ఇండియాలో దొరికే సుగంధ ద్రవ్యాలు, మూలికలు, కూరగాయలు, పండ్ల ఆధారంగా ప్రతి వంటకం భిన్నంగా ఉంటుంది. అందుకే కాలక్రమేణా భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తం గా ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, మారిషస్, కరేబియన్ దీవుల్లో ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ బిర్యానీ వెల్కమ్ చెప్తోంది.

సౌదీ, సౌత్ ఆఫ్రికాల్లో వడాపావ్ నోరూరిస్తోంది.  ‘టేస్ట్ అట్లాస్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మనుషు ల ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులపై ప్రతి సంవత్సరం రీసెర్చ్ చేస్తుంది. క్రొయేషియా దేశం లో స్థాపించిన ఈ సంస్థ  ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచికరమైన వంటకాల ఆధారంగా ఆయా దేశాల ఆహార ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. అలా 2023వ సంవత్సరానికి కూడా ఒక లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అత్యుత్తమ వంద వంటలు అందిస్తున్న దేశాల్లో మన దేశం11వ స్థానంలో నిలిచింది.

విదేశాలకు వెళ్తే.. 

* మీరు విదేశాలకు వెళ్లినట్టయితే కచ్చితంగా అక్కడి భాష, సంస్కృతి తెలిసి ఉండాలి. అప్పుడే ఆ దేశ రుచులను ఆస్వాదించవచ్చు. 

* కొన్ని దేశాల్లో చేపలు, గుడ్లను శాకాహారంగా భావించి వాటితో వింతైన వంటలు వండుతుంటారు. కాబట్టి కనీస అవగాహన ఉండాలి

* ప్రస్తుతం చాలా దేశాలు నాన్ వెజ్‌తో పాటు వెజ్ వంటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆయా దేశాల వెజిటేరియన్ ట్రావెల్ కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని రుచులను                             ఆస్వాదించవచ్చు. 

*టెక్నాలజీ సాయంతో ఎక్కడెక్కెడ సాంప్రదాయ రుచులు ఉన్నాయో తెలుసుకో వచ్చు. ‘హ్యాపీ కౌవ్’ అనే యాప్‌లో 180 దేశాల సమాచారంతోపాటు ఆహార మెనూకు సంబంధించిన వివరాలు          తెలుసుకోవచ్చు. 

*టెక్నాలజీ సాయంతో వెజ్ రెస్టారెంట్లను గుర్తించవచ్చు. 

*ఫుడ్ యాప్ సాయంతో స్థానిక ఉత్పత్తులు, రైతుల మార్కెట్లను కనుగొనవచ్చు.

*మీరు విదేశీ వంటల నచ్చకపోయితే భారతీయ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. వాటికోసం వెతకండి.