calender_icon.png 31 October, 2024 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన విదేశీ మారక నిల్వలు

22-06-2024 12:05:00 AM

ముంబై, జూన్ 21: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు రికార్డుస్థాయి నుంచి దిగివచ్చాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 14తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 2.992 బిలియన్ డాలర్ల మేర తగ్గి 652.895 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఇవి జూన్ 7తో ముగిసినవారంలో 4.307 బిలియన్ డాలర్లు పెరిగి 655.817 బిలియన్ డాలర్ల వద్ద కొత్త రికార్డును సృష్టించాయి.

కొద్దివారాలుగా ఈ నిల్వలు జోరుగా పెరిగిన తర్వాత తాజా సమీక్షావారంలో కాస్త తగ్గాయి. జూన్ 14తో ముగిసిన వారంలో విదేశీ మార క నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.097 బిలియన్ డాల ర్లు తగ్గి 574.24 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలూ తగ్గాయ్

దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో 1.015 బిలియన్ డాలర్లు తగ్గి 55.967 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 54 మిలియన్ డాలర్లు క్షీణించి 18.107 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు మాత్రం 245 మిలియన్ డాలర్లు  పెరిగి 4.581 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.