07-03-2025 12:55:26 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణాలకు చెందిన నిరుపేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిం చాలనే సంకల్పంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ప్రారంభించిందని, తద్వారా ఎంతో మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్కాలర్‌షిప్స్ నిలిచిపోవడంతో వారు అక్కడ ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీశ్‌రావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సర్కార్ వెంటనే స్పందించి పథకానికి సం బంధించిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌ను తాము గత అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తా మని, అందుకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ.. ‘విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విష యం మా దృష్టికి రాలే దు. బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉంది’ అని సమాధా నమిచ్చారని గుర్తుచేశారు. అయినపప్పటికీ ఇప్పటివరకు పైసా కూడా విదిల్చలేదని హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్
సీఎం రేవంత్ పాలనలో ‘తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ నడుస్తున్నది’ అని మాజీమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గడిచిన ఆరేళ్లలో గత ఫిబ్రవరి నెల జీఎస్టీ కలెక్షన్ వృద్ధి రేటు (కరోనా సంవత్సరం మినహా) ఎప్పుడూ 6 శాంత కంటే ఎక్కువే నమోదయ్యేదని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఫిబ్రవరిలో ఒక శాతం మాత్రమే నమోదైందన్నారు.