calender_icon.png 10 March, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ విద్యానిధి రుణాలు విడుదల చేయాలి

26-01-2025 12:04:51 AM

భారతీయ బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు దీపక్‌బాబు

కరీంనగర్, జనవరి 25 (విజయ క్రాంతి): బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు మంజూరైన రూe 40 కోట్ల నుంచి విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే నిధులు విడుదల చేయాలని భారతీయ బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీరాంభట్ల దీపక్‌బాబు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

గత మూడు సంవత్సరాలుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు రుణాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతు న్నారని, వెంటనే బ్రాహ్మణ పరిషత్ ద్వారా రుణాలు మంజూరు చేస్తే లబ్దిదారులు ఆయా యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా సకాలంలో రుణాలు, విదేశీ విద్యానిధి పథక ం రుణాలు మంజూరు చేయకపోవడంతో విదేశీల్లో ఉన్న విద్యార్థులు, పేద బ్రాహ్మ ణులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.