న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకూ తరలివచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను చేరాయి. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం ఈ కాలంలో దేశంలోకి 1,033.40 బిలియన్ డాలర్లు.
ఈ ఎఫ్‌డీఐల్లో మారిషస్ నుంచి వచ్చినవి 25 శాతంకాగా, సింగపూర్ నుంచి 24 శాతం వచ్చాయి. తదుపరి దేశంలోకి పెట్టుబడులు తరలించిన దేశాల్లో యూఎస్ (10 శాతం), నెదర్లాండ్స్ (7 శాతం), జపాన్ (6 శాతం), యూకే (5 శాతం), యూఏఈ (3 శాతం)లు ఉన్నాయి.
కేమాన్స్ ఐలెండ్స్, జర్మనీ, సైప్రస్‌ల నుంచి 2 శాతం చొప్పున ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. ఈ నాలున్నర ఏండ్లలో ఎఫ్‌డీఐలను అధికంగా సర్వీసులు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికమ్యూ నికేషన్స్, ట్రేడింగ్, కన్‌స్ట్రక్షన్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్ రంగాలు ఆకర్షించాయి.